ఫామ్‌హౌస్‌ నుంచే అసెంబ్లీ కుట్ర: రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

కలం, వెబ్ డెస్క్​ : సభాధిపతి స్థానంలో ఉన్న స్పీకర్ పట్ల, తల్లి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. మాతృమూర్తిని పూజించే సంస్కృతి ఉన్న మన సమాజంలో, స్పీకర్ స్థానాన్ని అవమానించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులకు స్పీకర్ పై కోపం ఉన్నట్టుందని సీఎం ఆరోపించారు.

ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపేందుకు ఎన్నో ప్రజాస్వామ్య మార్గాలు ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ సభ్యులు బరితెగించి అనుచిత భాషను ఉపయోగించారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. అసెంబ్లీలో వారు మాట్లాడిన తీరును సభలోని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయని తెలిపారు. తమ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే ఫామ్‌హౌస్‌లో ముందస్తు కుట్ర పన్ని, సభ సజావుగా సాగకుండా ప్లాన్ చేశారని ఆరోపించారు. సభ గౌరవాన్ని మంటగలుపుతూ బీఆర్ఎస్ నాయకత్వం తమ సభ్యులను ఉన్మాదులుగా మార్చిందంటూ సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Also Read : సభా గౌరవాన్ని మంటగలపొద్దు: ఎంపీ కడియం కావ్య

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>