కాళోజీ ఆశయాలను కొనసాగించాలి: ఎస్పీ జానకి షర్మిల

కలం, నిర్మల్ : తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా ఉద్యమాల గొంతుక కాళోజీ నారాయణరావు(Kaloji Narayana Rao) ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు (Kaloji Narayana Rao Jayanthi) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ప్రజా చైతన్యానికి కాళోజీ సాహిత్యం

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలను తన రచనలు, కవిత్వం ద్వారా సమాజానికి తెలియజేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు సామాజిక విలువలను పెంపొందించడంలో ఆయన సాహిత్యం కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ యూనస్ అలీ, ఎస్బీ సీఐ మల్లేష్, ఆర్‌ఐలు రామ్ నిరంజన్, శేఖర్, శ్రీపాల్, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>