కలం, వెబ్ డెస్క్ : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస రావు ( చిన్న శ్రీను) (Majji Srinivasa Rao) వైసీపీ అధిష్టానానికి భారీ షాకిచ్చారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్కు పంపించారు.
ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు , తాను నిర్వహిస్తున్న విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి సైతం తప్పుకుంటున్నట్లు మజ్జి శ్రీనివాస రావు తన లేఖలో తెలిపారు. బొత్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించే మజ్జి శ్రీనివాస రావు తాజా నిర్ణయం రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బొత్స తరపున ఫీల్డ్ రాజకీయం చేసేది చిన్నశ్రీనునే . అలాగే బొత్స అనుచర వర్గం అంతా చిన్నశీనుతోనే ఉంటుంది. స్థానిక ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చిన్నశ్రీను తాజా నిర్ణయం తీసుకోవడం ఉత్తరాంధ్ర వైసీపీ శ్రేణులకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు చిన్న శ్రీను త్వరలో జనసేన, లేదంటే టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది.

