కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్ కుమార్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. వారిద్దరినీ ఈ సమావేశాల మొత్తం కాలానికి అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేస్తూ శాసన మండలి చెర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ఆమోద ముద్ర వేస్తూ శాసన మండలి చెర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం శాసనమండలిని రేపటికి వాయిదా వేశారు.
అయితే అరెస్ట్ అనంతరం కోర్టు బెయిల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్(Tata Madhusudan), నవీన్ కుమార్ రెడ్డి (Naveen Kumar Reddy) తమపై వేటు నిర్ణయానికి ముందే మండలికి వచ్చారు. వారు కౌన్సిల్ కు రావడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ వేటు అనంతరం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తమ స్థానాల్లోనే కూర్చున్నారు. వారు బయటకు వెళ్లిపోవాలని చీఫ్ మార్షల్ సూచిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మండలిలో హైడ్రామా నెలకొంది. సభ నుంచి బయటకు వచ్చిన తాతా మధుసూదన్, నవీన్ కుమార్ రెడ్డి శాసనమండలి మీడియా పాయింట్ వద్దకు రాగా.. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ సెషన్ మొత్తం తాతా మధు, నవీన్ పై సస్పెన్షన్ వేటు ఉన్న కారణంగా వారిని మార్షల్స్, మీడియా పాయింట్ నుంచి తరలించారు. దీంతో మీడియా పాయింట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Also Read : 823 రోజులు మాత్రమే, వదిలిపెట్టం.. కేటీఆర్ ఆగ్రహం
Follow Us On: X(Twitter)

