పదే పదే స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారు.. మంత్రి ఫైర్

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అవమానకర వ్యాఖ్యలు చేశారని శాసనమండలిలో మంత్రి వాటికి శ్రీహరి (Vakiti Srihari) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు  పదే పదే స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉభయ సభలపై బీఆర్ఎస్ దురంహకార ధోరణి వీడాలన్నారు. స్పీకర్ పై జరిగిన దాడిపై చర్చ జరుగాలని.. ఈ సభ కొందరిది కాదు అందరిదీ అంటూ వ్యాఖ్యానించారు. నాటి నుంచి నేటి వరకు పెత్తందార్ల పోకడలు ఇంకా కొనసాగడం దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంకా అణచివేత ధోరణులు..

తాను తొలిసారి ఏమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చానని.. తనకు మాట్లాడే అవకాశం లేకుండా అడ్డుపడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పొడియాన్ని చుట్టుముట్టి అడ్డుపడుతున్నారని విమర్శించారు. తాత మధు మాటల వెనుక తప్పుడు ఆలోచన విధానం దాగి ఉందని విమర్శించారు. ఇంకా అణచివేత ధోరణులు కొనసాగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాలు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అవమానిచడమేనని స్పష్టం చేశారు.

వారిపై కూడా చర్యలు తీసుకోవాలి..

తనను జడ్పీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నప్పుడు 29 సార్లు గృహ నిర్భంధం చేశారని వాకిటి శ్రీహరి ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్ల పాలనలో తీవ్ర నిర్భంధం కొనసాగిందని విమర్శించారు. తాము రూల్ బుక్ ప్రకారమే సభను నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. నాడు బుక్ ను చింపినందుకే కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లను సస్పెండ్ చేసారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఏమ్మెల్యేలు సబితా, సునీతాలక్ష్మారెడ్డిపై జరిగిన దాడిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. స్పీకర్ పై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>