స్పీకర్‌ను బెదిరిస్తున్నారు.. హరీశ్ రావుపై శ్రీధర్ బాబు ఫైర్

కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేవారు. స్పీకర్ ను హరీశ్ రావు బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభను ఎలా నడపాలో.. స్పీకర్ ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అని చెబుతున్నార్నారు. ఇది చెప్పడానికి వాళ్లెవరు? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. సభను ఎలా నిర్వహించాలో స్పీకర్ కు చెప్పే అధికారం హరీశ్ రావు (Harish Rao)కు లేదన్నారు.

ఎవరైనా ఏదైనా అనుకుంటే లేదా భావిస్తే అది వాస్తవం కాదని, అసెంబ్లీ పరిసరాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోల్లో వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మంత్రి (Sridhar Babu) స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఆరోపణలపై స్పీకర్ ఇప్పటికే నివేదిక ఇవ్వాలని ఆదేశించారని ఆయన వెల్లడించారు. అయితే, స్పీకర్‌పై జరిగిన ఘటనను మాత్రం పక్కన పెట్టాలని హరీశ్ రావు అంటున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్పీకర్ ఆదేశించారన్నారు. అదే సమయంలో సభా (Telangana Assembly) గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఒక ఘటనను మాత్రమే ప్రస్తావిస్తూ మరో ఘటనను విస్మరించడం సరికాదని సూచించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ అసెంబ్లీ వ్యవహారాల్లో హుందాతనం పాటించాలని, స్పీకర్ పదవికి గౌరవం చూపాలని శ్రీధర్ బాబు సూచించారు.

Also Read : మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగారా? : సీతక్క

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>