కలం, భువనగిరి: వలిగొండ మండలంలోని (Valigonda Farmers) ఎమ్మార్వో ఆఫీస్ లో రైతుల భూములపై తప్పుడు నివేదిక ఇచ్చారంటు ఎమ్మార్వో ఆఫీస్‌లో రైతాంగం ఆందోళనకు దిగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజాప్రతినిధుల దృష్టిలో పడిన విలువైన భూములు మాయం అవుతున్నాయి. రికార్డులను సైతం మార్పించేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తునాయి. అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజాప్రతినిధులతో కుమ్మకై పేద రైతుల భూములను అప్పనంగా నొక్కేస్తున్నారు. భూ బాధితులు నెత్తినోరు కొట్టుకున్నా ఫలితం లేకుండాపోతోంది. ఏళ్ల కొద్ది సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూమి కోల్పోతున్నామన్నా కరువయ్యాడని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దిక్కుతోచని స్థితిలో రైతులు..
రైతుల భూములు కాజేసేందుకు చేసిన కుట్రలో భాగంగా స్థానిక రెవెన్యూ అధికారులు చేతులు కలపడంతో తమకు దిక్కుతోచడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే రియల్ వ్యాపారుల పంచన చేరి రికార్డులు మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు తమ భూములు కాపాడే నాథుడే లేకుండాపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6.32 ఎకరాలు వలిగొండ మండలం నాగారం గ్రామం లో గల భూమి స్థానిక రైతులకు ఉండాల్సి ఉంది. దీనిపై రెవెన్యూ అధికారులను రైతులు ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.
తప్పడు డాక్యుమెంట్లతో భూమిని కాజేసే కుట్ర..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండల నాగారం గ్రామం రెవెన్యూ పరిధిలో సర్వే నం.191 లోని 6 ఎకరాల 32 గుంటల భూమిపై రికార్డులో ఉన్న డాటాను చూడకుండా తప్పుడు నివేదిక సమర్పించారాని ఈ భూమి ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు దీనికి తోడు గత ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధుల రైతుల పేరు మీద ఉన్న 6.32 గుంటల భూమిని‘డిలేషన్’ పెట్టి అక్కడి నుంచి రైతులను తప్పించేందుకు కుట్రలు చేశారు. దీనికి రెవెన్యూ అధికారులు సైతం చేతులు కలిపి ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు పంపి రైతుల భూములు కొల్లగొట్టేందుకు యత్నం చేశారు. దీనిపై రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై యాదాద్రి జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

