ప్రేమ వ్యవహారం.. పోలీస్ స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం

కలం, మెదక్ బ్యూరో : ప్రేమ వ్యవహారంలో తనపై అక్రమంగా కేసు నమోదు చేసి పోలీసులు వేధిస్తున్నానంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. మెదక్ జిల్లా రామాయంపేట (Ramayampet) పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ లో దుర్గాప్రసాద్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. మంటలతో పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు.

యువకుడిపై మంటలను ఆర్పేందుకు హెడ్ కానిస్టేబుల్ దామోదర్ ప్రయత్నించడంతో అతనికి కూడా గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరినీ నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ లో యువకుడు నిప్పంటించు కోవడంతో ఒక్కసారి స్థానికంగా కలకలం. యువకుడి పరిస్థితి హెడ్ కానిస్టేబుల్ గాయాల తీవ్రతతో పాటు యువకుడి ఆత్మహత్యతో పాటు కేసు పై ఉన్నత అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>