ప్రజావాణికి 500 మంది బీఆర్ఎస్ శ్రేణుల క్యూ..!

​కలం, ఖమ్మం బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనా వైఫల్యాలను నిలదీస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన (BRS Protest) స్వరం వినిపించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుల మార్గదర్శకత్వంలో సోమవారం సుమారు 500 మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు క్యూ కట్టి జిల్లా కలెక్టర్ అంకిత్‌కు వినతిపత్రాలు సమర్పించారు.

​ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలను తక్షణమే నెరవేర్చాలని నాయకులు డిమాండ్ చేశారు. 1000 రోజుల కాలంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఒకేసారి వందలాది మంది కార్యకర్తలు క్రమశిక్షణతో క్యూ లైన్లో వెళ్లి కలెక్టర్ అంకిత్‌ను కలవడం కలెక్టరేట్ ఆవరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

​ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలనలో రైతులు, యువతలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇచ్చి నెరవేర్చని హామీలపై ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>