కలం, స్పోర్ట్స్ : మహిళల ఆసియా కప్‌లో(Womens Asia Cup 2026) మరోసారి ట్రోఫీ వివాదం తెరపైకి వచ్చే అవకాశముంది. సెప్టెంబర్ 13న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌కు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) హాజరు కానున్నట్లు తాజా సమాచారం. భారత్ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని జట్టు గ్రూప్ దశలో అజేయంగా నిలిచింది. పాకిస్థాన్‌ను కూడా ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. భారత్ ఫైనల్ చేరి టైటిల్ గెలిస్తే అసలు ఆసక్తి ట్రోఫీ అందజేతపైనే ఉండనుంది.
ఏసీసీ అధ్యక్షుడిగా నఖ్వీ (Mohsin Naqvi) విజేతలకు ట్రోఫీ అందించే అవకాశం ఉంది. గత ఏడాది పురుషుల ఆసియా కప్ ఫైనల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. పాకిస్థాన్‌పై గెలిచిన భారత్.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోలేదు. దీంతో ట్రోఫీ లేకుండానే భారత ఆటగాళ్లు పోడియంపై సంబరాలు చేసుకున్నారు. ఈసారి మహిళల జట్టు విషయంలో ఏం జరుగుతుందన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా లేదు. బీసీసీఐ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read : అరోనియన్‌ను చిత్తు చేసిన నిహాల్ సరీన్!
Follow Us On : WhatsApp

