కోటి ఓట్లు తొలగించే కుట్ర.. సీఎం సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియలో భాగంగా కోటి మంది ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ స్థాయిలో ఎక్కువ ఓట్లను తీసేసేలా ఎన్నికల సంఘంతో కలిసి కేంద్రం చేపట్టిందన్నారు. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటు నమోదులో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తొలగిపోతుందన్నారు.

తన సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రాంతంలో 80 వేల ఓట్లు తీసేస్తున్నారని సీఎం రేవంత్ వాపోయారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపారన్నారు. బెంగాల్, బీహార్ విధానాన్నే తెలంగాణలోనూ అమలు చేయబోతున్నట్లు బీజేపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బూత్‌ల వారీగా ఓట్ల తొలగింపు..

వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవాలనేది సర్ ద్వారా నిర్ణయించబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే, ప్రతి బూత్‌ల వారీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారని ఆరోపించారు. ఎక్కడైతే తమకు వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయో.. అక్కడ తొలగిస్తున్నారని విమర్శించారు. తమకు అనుకూలంగా ఉన్న చోట అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి ఓట్లను నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోనే పుట్టిన వారి ఓట్లను తొలగిస్తున్నారని.. ఇది అత్యంత దారుణమన్నారు. దీనిపై ఇంతవరకు బీఆర్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>