ఇంటి నుంచి దుర్వాసన.. తలుపులు తెరిచి చూడగా షాకింగ్ సీన్!

కలం అచ్చంపేట: నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా అమ్రాబాద్ (Amrabad) మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి హత్య (Murder Case) కు గురైన ఘటన సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బురానుద్దీన్‌ను తమ కుటుంబ సభ్యులు భార్య, ఇద్దరు కుమారులు కలిసి మూడు రోజుల క్రితం హత్య చేసి మృతదేహాన్ని కవర్ సంచిలో పెట్టి ఇంట్లోని ఓ గదిలో పెట్టారు. అనంతరం ఇంటికి తాళం వేసి పరారైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

అయితే చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో, అదే గ్రామానికి చెందిన మృతుడికి వరుసకు అల్లుడైన వ్యక్తిని ఆరాతీయగా.. వాళ్ళ ఫోన్లు కలవడం లేదని తెలిసింది. వెంటనే వారి ఇంటికి వెళ్లి చూడగా దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై సోమవారం ఉదయం సీఐఎస్ఐ డాగ్స్ వర్డ్ క్లూస్ టీమ్‌తో విచారణ జరిపి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>