కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీలో గట్టిగా నిలదీయాలని కేసీఆర్ తమకు స్పష్టంగా చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్ పార్క్ వద్దకు ఎమ్మెల్యేలతో కలిసి చేరుకున్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ను అవమానించడం ఇదే మొదటిసారి కాదన్నారు. తనను ఎంత అవమానించినా.. పట్టించుకోవద్దని కేసీఆర్ చెప్పారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 22 ఏ భూములతో ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అందరినీ మోసం చేసిందన్నారు. జీవో నెం.97 తెచ్చి పాలిటెక్నికల్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం.. టీ షర్టులు విప్పేసి!
Follow Us On: X(Twitter)

