కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సత్య నికేతన్‌లోని బాయ్స్ పీజీ హాస్టల్ కుప్పకూలిన (Hostel Collapse) ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు. మరో పది మంది ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతుండగా.. కింద ఎంత మంది ఉన్నారో స్పష్టంగా చెప్పలేకపోతున్నామని అధికారులు తెలిపారు. జేసీబీలు, ప్రొక్లెయినర్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతం ఇరుకుగా ఉండటంతో ఎక్కువ వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సీఎం రేఖా గుప్తా సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఈ ఘటనపై ఆరా తీశారు.
నిర్మాణ పనులు చేస్తుండటంతో..
సత్య నికేతన్ (Satya Niketan) ప్రాంతంలోని అయిదు అంతస్తుల బాయ్స్ పీజీ హాస్టల్ భవనం ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది(Hostel Collapse). దీనికి ప్రధాన కారణం, బిల్డింగ్ సెల్లార్లో చేస్తున్న నిర్మాణ పనులే అని అధికారులు గుర్తించారు. ఒకవైపు సెల్లార్ పనులు, మరోవైపు వర్షాల కారణంగా పిల్లర్లు బలహీనంగా మారి, ఇంతటి ప్రమాదానికి కారణమైందని వివరించారు. ఘటన కూలిపోయినప్పుడు పెద్ద ఎత్తున శబ్ధాలు వచ్చాయని, భూకంపం వచ్చిందని భావించామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Also Read : ఎయిర్‌పోర్టులో భీకర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!
Follow Us On: X(Twitter)

