కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Sanjay Jaju) ఆదివారం మెట్రో రైలు ఎక్కారు. బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి ప్యారడైజ్ వరకు ప్రయాణించి, స్టేషన్ల నిర్వహణను తనిఖీ చేశారు. మెట్రో(Hyderabad Metro)లో ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలు, ఇంకా మెరుగుపడాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో రోజువారీ రద్దీ గురించి ఆరా తీశారు. నగర ప్రయాణికులకు సౌకర్యవంతంగా, వేగంగా గమ్య స్థానాలకు చేరే క్రమంలో మెట్రో అధికారులు, సిబ్బంది తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.
మెట్రో ప్రయాణం సురక్షితమే కాకుండా, పర్యావరణ హితమని సంజయ్ జాజు (Sanjay Jaju) తెలిపారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో రైల్ సేవలను మరింత నాణ్యతతో అందించాల్సిన అవసరం ఉందని సీఎస్ అభిప్రాయపడ్డారు. మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి సంజయ్ జాజుతో ఉన్నారు.
Also Read : రూ.40 కోట్లతో సీఎం సోదరుడికి భద్రత: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)

