కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదివారం దేవరకద్ర (Devarakadra) నియోజకవర్గంలో పర్యటించారు. సెప్టెంబర్ 5, 6, 12, 13వ తేదీల్లో సర్ ప్రచార కార్యక్రమాలపై క్షేత్ర స్థాయిలో సమీక్ష చేపట్టారు. మొదట అడ్డాకల్ మండలం శక్రాపూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాలు 103, 104లను తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాట్లతో పాటు సంబంధిత కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఓటర్ల జాబితాపై సరిగ్గా ఉండేలా..
మూసాపేట మండలం జనంపేటలోని పోలింగ్ కేంద్రాలు 81, 82, 83, 84లను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. ఓటర్ల జాబితాను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరుకు అవసరమైన సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భూత్పూర్ మండలం పొతుగుట్ట తండాలోని పోలింగ్ కేంద్రం 24ను కూడా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.
Also Read : కేసీఆర్ రాజీనామా చేయాలి : ఎమ్మెల్యే పాయం
Follow Us On: Instagram

