రోడ్లపై కాదు.. అసెంబ్లీకి వచ్చి చర్చించాలి: మంత్రి శ్రీధర్ బాబు

కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని, ఆలోచనలను పంచుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) కోరారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న మహాధర్నాలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే మంచి సూచనలు ఇస్తే.. వాటిని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ (BRS) నేతలు రోడ్లపై ఆందోళనలు చేయడం కంటే అసెంబ్లీకి వచ్చి తమ ప్రశ్నలు, అభ్యంతరాలను లేవనెత్తాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి వస్తే అన్నింటికీ సమాధానం చెప్తామని ఆయన అన్నారు. ఈ సమయంలోనే కేసీఆర్ (KCR) నాయకత్వం సరిగా లేకుండే బీఆర్ఎస్ వాళ్లను ప్రజలు మరో పదేండ్లు రోడ్లపైనే కూర్చోపెడుతారని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల జారీ, గ్రూప్-1 నియామకాల విషయంలో ప్రజలకు న్యాయం జరగలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి (Sridhar Babu) తెలిపారు. సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.

Also Read : అరోనియన్ వ్యాఖ్యలు.. క్రామ్నిక్ కౌంటర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>