కలం, మహబూబ్ నగర్ బ్యూరో : అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే అధికారం లేదని, ఆ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్లే ఆటో కార్మికుల కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని, పిల్లల ఫీజు, ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఆటో కార్మికుల కుటుంబాలు కొట్టుమిటాడుతున్నాయని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ హామీని మర్చిపోయారని శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) విమర్శించారు. ఆటో కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని తెలిపారు. రూ.12,000 వేల ఆర్థిక సహాయం ఆటో కార్మికులకు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పీఆర్సీ, ఎరియర్స్ ,మెడికల్ బిల్లులు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు సంతోషంగా లేరన్న మాజీ మంత్రి.. మగవారి టికెట్ రేట్స్ పెంచి ఆడవాళ్లకు ఉచితం అంటున్నారన్నారని మండిపడ్డారు. కనీసం రైతులు చనిపోతే రైతు బీమా కూడా ఇవ్వలేని దుర్భర స్థితిలో ప్రభుత్వం నడుస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక భరోసా ఉండేదని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. మళ్లీ బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వస్తుందని, మహబూబ్ నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు తప్పులు ఎత్తిచూపితే పొరపాట్లు సరిచేసుకోవాల్సింది పోయి, కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం ను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజల్ని జాగృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కార్పొరేటర్లు నవకాంత్, కుర్వ శ్రీశైలం, నరేష్, నరేందర్, గణేష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీను నాయక్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఇస్రో భవిష్యత్తుపై శాస్త్రవేత్తల ఆందోళన
Follow Us On: X(Twitter)

