ఖమ్మంలో పోలీసుల చాకచక్యం.. గంటల్లోనే చోరీ ఫోన్‌ రికవరీ

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) ప్రభుత్వ ఆసుపత్రిలో చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను టూ టౌన్ పోలీసులు (Two Town Police) గంటల వ్యవధిలోనే ట్రేస్ చేసి ఆదివారం బాధితుడికి అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంకు చెందిన దామల నాగయ్య తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం రాత్రి ఆసుపత్రి బెంచ్‌పై నిద్రించిన నాగయ్య.. ఆదివారం ఉదయం నిద్రలేచేసరికి తన మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.

వెంటనే ఖమ్మం టూ టౌన్ (Khammam Two Town) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రమేష్ స్పందించి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొబైల్ ఫోన్ ఆచూకీని గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని బాధితుడు నాగయ్యకు అప్పగించారు. తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కష్టకాలంలో తన మొబైల్ ఫోన్‌ను వెతికి అందించిన ఎస్ఐ రమేష్‌కు నాగయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి, గంటల వ్యవధిలోనే మొబైల్‌ను ట్రేస్ చేసి బాధితుడికి అప్పగించిన టూ టౌన్ పోలీసుల పనితీరును పలువురు అభినందించారు.

Also Read : ఏనుగొండలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>