గోదావరి పుష్కరాలు.. ఘాట్ల అభివృద్ధికి శ్రీకారం !

కలం, బాసర : గోదావరి పుష్కరాల నేపథ్యంలో బాసర (Basara)లో రూ.20 కోట్లతో చేపట్టనున్న ఘాట్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలకు (Godavari Pushkaralu) బాసరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

పుష్కర భక్తుల రద్దీకి అనుగుణంగా ఘాట్లను ఆధునీకరించి, అవసరమైన సౌకర్యాలను విస్తరించనున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు. బాసర(Basara)లో భక్తుల రాకపోకలు, పుణ్యస్నానాలు, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

పుష్కరాల సందర్భంగా బాసరలో భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel), ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్‌ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, బాసర ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనాదేవి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : ‘స్మో-కింగ్’ వచ్చేస్తున్నాడు.. NBK 111 నుంచి క్రేజీ అప్‌డేట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>