కలం, నిర్మల్: శ్రావణమాసం చివరి సోమవారం పురస్కరించుకొని సాయి దీక్ష సేవాసమితి (Sai Deeksha Seva Samithi) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో మహా పాదయాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలను ఆవిష్కరించి మాట్లాడారు. పట్టణంలోని నటరాజ్ నగర్ ఉమామహేశ్వర శివాలయం నుంచి సోమవారం ఉదయం 8.30 గంటలకు మహా పాదయాత్ర ప్రారంభమైంది.
దిలావర్పూర్ మండలం కదిలి (Kadili) గ్రామంలోని శ్రీమాత అన్నపూర్ణ పాపహరేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగుతుందని తెలిపారు. సాయి దీక్ష సేవాసమితి (Sai Deeksha Seva Samithi) ఆధ్వర్యంలో ఈ పాదయాత్రను వరుసగా 10వసారి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. లోకకళ్యాణార్థం చేపడుతున్న ఈ ఆధ్యాత్మిక మహా పాదయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ నందిగుండం దుర్గామాత ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటచారి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి నరహరి తదితరులు పాల్గొన్నారు.
Also Read : “పంట కుంటలు” రైతులను ఆదుకునే అమృత భాండాలు!
Follow Us On: X(Twitter)

