కాంగ్రెస్ మహా ధర్నాలో పాల‌మూరు నాయకులు!

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ భారీ మహా ధర్నా (Congress Maha Dharna) నిర్వహించారు. ఈ మహా ధర్నాలో మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, వనపర్తి జిల్లాడీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ పాల్గొని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ జీతం తీసుకుంటున్నార‌న్నారు. కానీ, ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం లేద‌న్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఉన్న కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీతనం ఎంతో ముఖ్యమని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి హాజరై ప్రజల సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ మహా ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, డీసీసీ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>