కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి శాసనసభా పక్షం సమావేశం (BRSLP Meeting) ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆయన అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నారు. ఈ ఉమ్మడి సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరుకానున్నారు.
ఈ భేటీలో సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాప్రతినిధులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రజా సమస్యలు, హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ మరియు మండలి వేదికగా గళం విప్పాలని, ప్రజల తరఫున నిలబడాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునివ్వనున్నారు.

