బీఆర్ఎస్ మాదిరి భూములపై కన్నేసిన కాంగ్రెస్: రాంచందర్ రావు

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాదిరిగానే రేవంత్ సర్కార్ సైతం దురుద్దేశాలతో ప్రజల భూములపై కన్నేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూభారతి, 22ఏ పేరుతో  అవినీతి, అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి మహా ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల భూమిని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని మండిపడ్డారు. భూముల రిజిస్ట్రేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిషేధిత జాబితాలో నుంచి భూమి తీసేయాలంటే అధికారులు 30 శాతం కమీషన్ అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం క్షీణించిపోయిందని దుయ్యబట్టారు.

ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం హైడ్రా, క్యూర్ (CURE), 22ఏ పేర్లతో  ప్రజల్లో భయం, ఇబ్బందులను సృష్టిస్తోందని మండిపడ్డారు. తాము శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>