ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం.. బకాయిలపై నేడు కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : అమరావతిలోని ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 11 ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సీఎం ముఖాముఖి భేటీ కానున్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ భేటీలో ప్రధానంగా కొత్త పే రివిజన్ కమీషన్ (PRC) నియామకం, అలాగే కొత్త పీఆర్సీ అమలులోకి వచ్చే వరకు మధ్యంతర ఉపశమనం (IR) ప్రకటనపై ఉద్యోగ సంఘాల నేతలు గళమెత్తనున్నారు. వీటితో పాటు కరవు భత్యం (DA) బకాయిల విడుదల, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ గ్రాట్యుటీ, పింఛన్ సదుపాయాల బకాయిల చెల్లింపులపై సమగ్రంగా చర్చించనున్నారు.

Also Read : “అర్హత లేనివారికి ఉద్యోగాలా?”.. మెగా డీఎస్సీపై వైఎస్ జగన్ ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>