ఇండియాకు బ్రెజిల్ పరీక్ష.. గంగూలీ కీలక వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్ : ఇండియా ఫుట్‌బాల్‌కు వరుసగా పెద్ద పరీక్షలు ఎదురుకానున్నాయి. బ్రెజిల్, ఉరుగ్వే, పనామాతో భారత్ అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ అవకాశాన్ని భారత ఆటగాళ్లు పూర్తిగా ఉపయోగించుకోవాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 26న బెంగళూరులో పనామాతో ఇండియా తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 3న కోల్‌కతాలో బ్రెజిల్‌తో ఆడుతుంది. అక్టోబర్ 6న అదే వేదికపై ఉరుగ్వేతో మ్యాచ్ ఉంటుంది. ఈ మూడు జట్లూ ఇండియా కంటే మెరుగైన ర్యాంకులో ఉన్నాయి.

ముఖ్యంగా బ్రెజిల్‌తో మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌తో ఆడటం భారత ఆటగాళ్లకు పెద్ద అవకాశం. బ్రెజిల్ బలమైన జట్టుతో భారత్‌కు రావాలని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. తమకంటే మెరుగైన ఆటగాళ్లతో ఆడినప్పుడే మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుందని గంగూలీ పేర్కొన్నారు. అలాంటి మ్యాచ్‌లు భారత ఆటగాళ్లకు విలువైన అనుభవాన్ని ఇస్తాయని చెప్పారు.

ఈ అనుభవం వారి అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే ఇలాంటి మ్యాచ్‌లు ఒక్కసారి మాత్రమే కాకుండా తరచూ జరగాలని గంగూలీ కోరారు. బ్రెజిల్‌తో పాటు ఉరుగ్వే, పనామాతో ఆడటం కూడా ఇండియాకు ఉపయోగపడుతుందని చెప్పారు. వరుసగా ఉన్న ఈ మ్యాచ్‌లు భారత జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో తమను తాము పరీక్షించుకునే అవకాశం ఇవ్వనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>