కలం, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) మండల కేంద్రంలో గుడుంబా స్థావరాలపై సీఐ బుద్దే స్వామి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. 2 వేల లీటర్ల గుడుంబాతో పాటు బెల్లం పానకం ధ్వంసం చేశారు. గుడుంబా తయారీకి ఉపయోగించే వస్తువులు, పాత్రలను ధ్వంసం చేశారు. గుడుంబా తయారు చేసే నిర్వాహకుడి కోసం వెతుకుతున్నారు. నాటు సారా తయారు చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్వామి హెచ్చరించారు.

