నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. అధికారులకు సీఎం హెచ్చరిక

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రాజెక్టులో వేగం పెంచాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే ఎంతటి అధికారులైనా చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మద్దూరు, కోస్గి , మండలాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులతో పాటు నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం దుద్యాల మండలం హకీంపేట లో జరుగుతున్న ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం అక్కడే ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని రోడ్లు భవనాల శాఖ పనుల పురోగతిని సమీక్షలో అధికారులు సీఎంకు వివరించారు. నియోజకవర్గ పరిధిలో రోడ్ కనెక్టివిటీ , భవన నిర్మాణాలు, బ్రిడ్జ్ లు, ఇతర నిర్మాణాల్లో వేగం పెంచాలని అధికారులకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రతీ తండాకు రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తండాలకు రోడ్డు నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అక్కడికక్కడే సంబంధిత అధికారిపై చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. గ్రామాల్లో వాగుల వద్ద కల్వర్టులు, బ్రిడ్జ్ ల నిర్మాణానికి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని, చెక్ డ్యామ్ తరహాలో వాగుల వద్ద బ్రిడ్జిల నిర్మాణం ఉండేలా డిజైన్లు రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

అనంతరం ఇరిగేషన్ పై సమీక్ష నిర్వహిస్తూ గత సమీక్ష సమావేశంలో సీఎం సూచనలను అనుగుణంగా పనుల్లో మక్తల్- నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్ పనులు ముందుకు తీసుకెళుతున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఫేజ్-2 పనులకు వీలయినంత త్వరగా టెండర్లు పిలవాలని, ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు ప్రతీ సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ కు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సీఎం (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, ఫేజ్-1 పనులను డిసెంబర్ 2027 నాటికి, ఫేజ్-2 పనులను అక్టోబర్ 2028 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత శాఖల అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>