శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి మార్గదర్శకం: సంజీవ్ ముదిరాజ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: శ్రీకృష్ణుని బోధనలు సమాజంలోని ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తాయని డీసీసీ అధ్యక్షులు (DCC President) సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) అన్నారు. శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) సందర్భంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణంలోని శ్రీ జగన్నాథ మందిరం, ఇస్కాన్ , అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థాపకాచార్యులు పరమపూజ్య ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల స్ఫూర్తితో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలలో పాల్గొని, శ్రీ జగన్నాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుని బోధనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తాయని, ప్రేమ, శాంతి, ధర్మం, మానవత్వం వంటి విలువలను సమాజంలో పెంపొందించుకోవాలని అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ బంగ్లా రవి, కాంగ్రెస్ నాయకులు బూరేమోని చందు యాదవ్, రాకేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>