కుంభకర్ణుడిలా కేసీఆర్‌.. కాంగ్రెస్ వినూత్న నిరసన!

కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వినూత్న రీతిలో తమ నిరసనను (Congress Protest) తెలిపారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయనను ‘కుంభకర్ణుడి’ పాత్రతో పోలుస్తూ భారీ పోస్టర్‌ను ప్రదర్శించారు.

ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొని, కేసీఆర్ పరిపాలనా కాలాన్ని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలు, రైతుల గోడు పట్టించుకోకుండా కేసీఆర్ నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన బాధ్యతారాహిత్యానికి చిహ్నంగానే ఈ కుంభకర్ణుడి పోస్టర్ ప్రదర్శన చేపట్టినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>