జేఎన్టీయూలో విద్యార్థుల గ్రూప్ వార్: పలువురికి గాయాలు!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ కూకట్ పల్లి జేఎన్టీయూ (JNTU) ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్‌లో నిర్వహించిన తీజ్‌ వేడుకల సందర్భంగా విద్యార్థుల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం (Clash) చివరకు పరస్పర దాడులకు దారితీసింది. ఆరంభంలో ఓ విద్యార్థిపై మరికొందరు దాడి చేయడంతో ప్రారంభమైన ఈ గొడవ, కొద్దిసేపటికే తీవ్రరూపం దాల్చింది.

దీంతో గౌతమి, మంజీరా హాస్టళ్లకు చెందిన విద్యార్థులు కర్రలతో పరస్పరం దాడులకు (JNTU Clash) తెగబడ్డారు. హాస్టల్ ఆవరణలో విద్యార్థులు చెల్లాచెదురుగా పరిగెత్తుతూ గొడవపడటంతో క్యాంపస్‌లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న విశ్వవిద్యాలయ సిబ్బంది, పోలీసులు తక్షణమే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్యాంపస్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పటిష్టం చేశారు.

Also Read : వరంగల్ ఈస్ట్‌.. ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎవ‌రంటే?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>