కలం, యాదగిరిగుట్ట : యాదాద్రి భువనగిరి జిల్లాలో 22ఏ కింద ప్రభుత్వ భూములు, 39,468 ఇండ్లు, ప్రైవేట్ స్థలాలు నిషేధిత జాబితాలో చేరడంతో గందరగోళానికి దారితీసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే బ్లాక్ చేయడంపై యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా (BRS Protest) నిర్వహించింది. అనంతరం బీఆర్ఎస్ నేతలు తహసీల్దార్ గణేశ్ నాయక్‌కి వినతిపత్రం అందించారు.
ఈ ధర్నాలో బీఆర్ఎస్ పట్టణ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి జిల్లా పరిధిలో సుమారు 28,549 ఎకరాల ప్రభుత్వ భూములు, 39,468 ఇండ్లు, ఇంటి స్థలాలు ఈ నిషేధిత జాబితాలో చేర్చబడ్డాయని ఆరోపించారు. అసలు యజమానులు తమ పట్టా భూములు, ఇండ్లను అమ్ముకోవడానికి, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిషేధిత జాభితలలో చేర్చిన సర్వే నెంబర్లు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పులు చేసి వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తే ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంతో పేదలు నష్టపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జ్పడీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ముక్కెర్ల సతీశ్, దండబోయిన వీరేశ్ యాదవ్, అంకం నర్సింహా, మాటూరి బాలయ్య, బీఆర్ఎస్ నాయకులు, లింగంరాజు యాదవ్, కార్యకర్తలు, బాధితులు పాల్గొన్నారు.

