అందుకే కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు.. పొన్నం ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలో బీజేపీ నేతలు తమ పార్టీలోని అంతర్గత పోరులో ఉనికిని కాపాడుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒకరిని మించి ఒకరు విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలపై బీజేపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మాని ఢిల్లీకి వెళ్లి ప్రధాని  మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు. ​ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన బీజేపీ నేతలు.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పరిమితమవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ను తిడితేనే అధిష్టానం తమను గుర్తిస్తుందనుకోవడం పొరపాటని హితవు పలికారు.

పదిహేనేళ్లలో రాబట్టిందేమిటి?

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపు 13 ఏళ్లు అవుతున్నా, విభజన హామీలు సహా తెలంగాణకు రావాల్సిన అనేక నిధులు, ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయని మంత్రి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒకలా, తెలంగాణకు మరొకలా ఎందుకు నిధులు మంజూరు చేస్తున్నారో స్థానిక బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు బకాయిలు పెడితే నోరు మెదపని బీజేపీ, ఇప్పుడు ప్రతి నెలా చెల్లింపులు చేస్తూ బకాయిలు తీరుస్తున్నా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమన్నారు.​

పెండింగ్ ప్రాజెక్టులపై పోరాడాలి..

రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వెళ్తోందని, ఫెడరల్ వ్యవస్థలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించడంలో స్థానిక బీజేపీ ఎంపీలు, నేతలు విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు మెట్రో రైల్ విస్తరణ, నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ​రీజినల్ రింగ్ రోడ్ (RRR) సహా అనేక పెండింగ్ ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు, నిధులు మంజూరు చేయించే బాధ్యతను బీజేపీ నేతలు తీసుకోవాలని కోరారు.
​”రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కట్టిపెట్టి, తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం, దమ్ము చూపించండి” అని బీజేపీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>