కడ్తాల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కలం, నిర్మల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో (Kadthal Village) గురువారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుర్రం రాము లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుర్రం రాము మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, ఆధునికంగా మారుతుందని అన్నారు.

అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమయా తస్కిన్, జీపీఓ గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, నాయకులు పస్పుల అశోక్, అంగన్వాడీ టీచర్లు గోదావరి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>