కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా, క్యాబినెట్ మంత్రి హోదాతో బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి రుణపడి ఉంటానని గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijayalaxmi) తెలిపారు. ఆమెకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మరింత బాధ్యతగా ముందుకు సాగుతానని గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ గా తనకు లభించిన ఈ అవకాశం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగించుకుంటానని చెప్పారు. తెలంగాణ సమగ్ర, సుస్థిర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. కాగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డిపై వేటు వేసిన పార్టీ విజయలక్షికి పదవి కేటాయించింది.

