కలం, వెబ్ డెస్క్: మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ (Konda Surekha) పార్టీ నుంచి కూడా వెళ్లిపోతారనే ఊహాగానాలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోనని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. తమకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీపై నమ్మకం ఉందన్నారు. మంత్రి పదవి ఉన్నా, లేకున్నా ఎమ్మెల్యేగా మాత్రం ఉంటూనే ప్రజా సేవ చేస్తానని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ (Revanth Reddy) బ్లాక్ మెయిల్ చేయడంతోనే తనను తప్పించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా ఆయన తీరు మార్చుకోవాలన్నారు.
ఉదయం నుంచి ఉత్కంఠ..
కొండా సురేఖ (Konda Surekha) బర్తరఫ్, రాజీనామా వంటి అంశాలపై ఉదయం నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆమెను మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆమె పార్టీకి కూడా రాజీనామా చేస్తారనే వార్తలు చక్కర్లు కొట్టగా.. వాటిపై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఉంటానని స్పష్టం చేయడంతో ఉప ఎన్నిక లేనట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : మునుగోడు అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమమే నా ధ్యేయం: రాజగోపాల్ రెడ్డి
Follow Us On : WhatsApp

