మునుగోడు అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమమే నా ధ్యేయం: రాజగోపాల్ రెడ్డి

కలం, చౌటుప్పల్: పదేళ్లపాటు అణచివేతకు గురై, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేసిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలనేదే తన ముఖ్య ఉద్దేశమని మునుగోడు ఎమ్మెల్యే (Munugodu MLA) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా, నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో గురువారం ఆయన రూ. 76.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల ప్రయోజనాలు, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 3.75 మీటర్లు ఉన్న పాత రోడ్లను 5.5 మీటర్ల వెడల్పుగా విస్తరించాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి అందించగా, ప్రజా ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు సహకారం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఆయన (Raj Gopal Reddy) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రహదారుల విస్తరణ, నిర్మాణ పనుల్లో అధికారులు, స్థానిక ప్రజలు, మీడియా మిత్రులు పూర్తి సహకారం అందించాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోతున్న రైతులకు గరిష్ట స్థాయిలో నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం వద్ద ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. మంత్రివర్గ విస్తరణ, పదవుల కేటాయింపు అంశాలు కాంగ్రెస్ అధిష్టానం పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వెల్లడించారు.

కార్యకర్తల సంక్షేమమే ధ్యేయం..

పార్టీ కోసం రక్తం చిందించిన ప్రతీ కార్యకర్తను ఆదుకోవడమే తన ప్రధాన ఎజెండా అని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Also Read : కొండా సురేఖకు కేఏ పాల్ బంప‌ర్ ఆఫ‌ర్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>