కలం, వెబ్‌డెస్క్: దక్షిణాదిలో ఈడీ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. పలు డ్రగ్స్ కేసులకు(Drug Case) సంబంధించి ఏక కాలంలో నాలుగు రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు (ED Raids) నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో మొత్తం 30 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అక్రమ రవాణా, మనీ ల్యాండరింగ్‌పై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. గతంలో కేసులు నమోదైన వాళ్లు, అనుమానితులు, వారి ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికారులు పీఎంఎల్ఏ కింద 8 కేసుల్లో కీలక ఆధారాలు సేకరించారు. ఈ తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

