కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజకీయంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకోబోతోంది. మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కొండా సురేఖ (Konda Surekha) దంపతులు రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో, బర్తరఫ్ కంటే ముందే రాజీనామా చేయడమే గౌరవప్రదమని వారు భావిస్తున్నట్లు సమాచారం.
మంత్రి పదవి కోల్పోయిన తర్వాత పార్టీలో కొనసాగడం అవమానకరమని భావిస్తున్న కొండా సురేఖ దంపతులు (Konda Surekha Couple), ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ముందస్తు వ్యూహంలో భాగంగా ఉదయమే హైదరాబాద్ చేరుకోవాలని కొండా దంపతులు తమ అనుచరులకు పిలుపునివ్వడంతో రాజధానిలో రాజకీయ ఉత్కంఠ తీవ్రస్థాయికి చేరింది.
కాంగ్రెస్ హైకమాండ్ కీలక ఆదేశాలు..
కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి కొండా సురేఖకు హెచ్చరికలు జారీ చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఆమెను రాజీనామా చేయాలని ఆదేశించారు. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని పార్టీ అధినాయకత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేలోపే కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read : అభినందన్ వర్ధమాన్ షాకింగ్ నిర్ణయం.. సరికొత్త ప్రయాణం!
Follow Us On: X(Twitter)

