వ్యవసాయ క్షేత్రంలో క‌రెంట్ షాక్‌.. యువకుడు మృతి

క‌లం, పాలకుర్తి: పాల‌కుర్తి (Palakurthi) మండంలోని వావిలాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వ్య‌వ‌సాయ క్షేత్రంలో ప‌నుల కోసం వెళ్లిన ఓ వ్య‌క్తి క‌రెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. వావిలాల‌కు చెందిన అనుమర్తి ఉపేందర్‌ (31) వ్య‌వ‌సాయం చేస్తుంటాడు. గురువారం ఉద‌యం త‌న పొలం వ‌ద్ద ప‌ని ఉంటే వెళ్లాడు. విద్యుత్ తీగ‌ల స‌మీపంలో ప‌ని చేస్తుండ‌గా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గుర‌య్యాడు. దీంతో అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. ఉపేందర్‌ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>