కలం, ములుగు: జిల్లాలో ల్యాండ్‌మైన్ పేలడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. వెంకటాపురం మండలం నూగురు గ్రామానికి చెందిన మడకం నాగేశ్వరరావు (55)ఆవులను మేపేందుకు కర్రెగుట్ట అటవీ ప్రాంతానికి (Karregutta Forest) వెళ్లగా బుధవారం సాయంత్రం మందుపాతర పేలినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఆపరేషన్ కగార్‌కు ముందు మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలినట్లు సమాచారం. ఘటన అనంతరం నూగురు గ్రామస్థులు మృతదేహాన్ని కాలినడకన గ్రామానికి తీసుకొచ్చారు.

