ప్రజల సంక్షేమమే LIC ప్రధాన లక్ష్యం: శివ నాగ ప్రసాద్

కలం, కరీంనగర్: భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కరీంనగర్‌లోని స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఉచిత మెగా వైద్య శిబిరం, నగరంలో భారీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఉదయం కరీంనగర్ (Karimnagar) మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని సీనియర్ డివిజనల్ మేనేజర్ శివ నాగ ప్రసాద్ ప్రారంభించారు.

ప్రజలు భద్రత కోసం పాలసీలు తీసుకోవాలి..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ఐసి యొక్క ప్రధాన లక్ష్యం ప్రజల సంక్షేమమేనని పేర్కొన్నారు. “యోగక్షేమం వహామ్యహమ్” అనే సూక్తిని త్రికరణశుద్ధిగా పాటిస్తూ సామాజిక బాధ్యతలో భాగంగానే ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం నమ్మకమైన ఎల్ఐసీ పాలసీలను తీసుకోవాలని ఆయన కోరారు. మెడికవర్ ఆసుపత్రి కోఆర్డినేటర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎల్ఐసి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ లోకేష్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ మమతలతో పాటు నర్సింగ్ సిబ్బంది వైద్య సేవలందించారు. దాదాపు 200 మందికి పైగా వాకర్స్ ఈ ఉచిత వైద్య పరీక్షలను చేయించుకొని, వైద్యుల సలహాలు స్వీకరించారు.

అకట్టుకున్న భారీ ర్యాలీ..

సాయంత్రం 4:00 గంటలకు ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ అంబేద్కర్ స్టేడియం, కలెక్టరేట్ రోడ్, గీతా భవన్ మీదుగా సాగింది. బీమా ఆవశ్యకతను, ఎల్ఐసీ విశిష్టతను చాటిచెప్పే ప్లకార్డులతో సాగిన ఈ ర్యాలీ పుర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్, సేల్స్ మేనేజర్ హరికృష్ణ, సిఆర్ఎమ్ మేనేజర్ వేణుగోపాల్, డివిజనల్ ఆఫీస్ ఉద్యోగులు, ఏజెంట్ల సంఘం నాయకులు ప్రభాకర్ రావు, గట్టు రాజయ్యలతో పాటు పెద్ద సంఖ్యలో ఏజెంట్లు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>