కలం, నిర్మల్: గణేష్ ఉత్సవాల సందర్భంగా సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ (Nirmal SP) జానకి షర్మిల (Janaki Sharmila) సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన “BE CYBER WISE – Lord Ganesha Teaches Us” అవగాహన పోస్టర్ను బుధవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల సమయంలో సైబర్ నేరగాళ్లు నకిలీ విరాళాల అభ్యర్థనలు, ఫేక్ అకౌంట్లు, నకిలీ క్యూఆర్ కోడ్లు, అనుమానాస్పద లింకులు, ఆన్లైన్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం సమాచారం, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని తెలిపారు. గుర్తుతెలియని లింకులపై క్లిక్ చేయడం, అనుమానాస్పద యాప్లను డౌన్లోడ్ చేయడం, నకిలీ వెబ్సైట్లను వినియోగించడం చేయవద్దని హెచ్చరించారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజలకు సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పించేందుకు ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోని గణేష్ మండపాలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా యువత ఆన్లైన్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు సమాచారం అందించాలని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, సైబర్ క్రైమ్ ఎస్ఐలు ముత్యం, శ్రావణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

