ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్ : మిథున్ రెడ్డి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) తన హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి (AP Mithun Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిథున్ రెడ్డి (Mithun Reddy) మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రిగా వైఎస్సార్ తన హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని ఆయన కొనియాడారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. వైఎఎస్సార్ ఆశయాలు, సేవా స్ఫూర్తిని ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని మిథున్ రెడ్డి కోరారు.

కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, డీసీసీ కోశాధికారి రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, వేముల కృష్ణయ్య, మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పసుల రాజు, నాయకులు అజ్మత్అలీ, రాములు యాదవ్, ఎంఎ. కలీం, షబ్బీర్, ఉమర్ కొత్వాల్, ప్రశాంత్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Also Read : రాష్ట్రంలో రాబోయేది వైఎస్సార్ యుగం.. రాజ‌గోపాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>