అంతర్జాతీయ ఛాంపియన్‌.. చివరకు కూరగాయలు అమ్ముతున్నాడు!

కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ స్థాయిలో నాలుగు స్వర్ణ పతకాలు సాధించిన త్రోబాల్‌ క్రీడాకారుడు అమర్‌దీప్‌ కుమార్‌ (Amardeep Kumar) ప్రస్తుతం దయనీయంగా మారింది. జీవనోపాధి కోసం రాంచీలో కూరగాయలు విక్రయిస్తూ, క్యాబ్‌ కూడా నడుపుతున్నాడు. దేశం తరఫున పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచినప్పటికీ, తగిన ప్రోత్సాహం, ఆర్థిక భరోసా అందలేదు. దీంతో కుటుంబ పోషణ కోసం ఇతర పనులు చేయాల్సి వస్తోంది.

అమర్‌దీప్‌ కుమార్‌ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. దేశానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులకు సహాయం అందించాలని కోరుతున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు, క్రీడా సంఘాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నెటిజన్స్, ఇతర క్రీడాకారులు డిమాండ్ చేశారు.

Also Read : చెస్ బోర్డుపై ఆనంద్ దూకుడు.. టైటిల్‌పై కన్ను!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>