పేరుకే స్మార్ట్ సిటీ.. రేకుర్తిలో రోడ్డుపైనే మురుగు నీరు: AIFB

​కలం, కరీంనగర్: కరీంనగర్ నగర పరిధిలోని 21వ డివిజన్ రేకుర్తి (కొత్తవాడ – Rekurthi)లో మురుగు నీరు పారే మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా డ్రైనేజీ మురుగు నీరు రోడ్డుపైనే నిలిచిపోవడంతో కాలనీవాసులు నరకయాతన అనుభవిస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ​రోడ్డుపై భారీగా మురుగు నీరు నిలిచిపోవడంతో దాదాపు ఐదు కుటుంబాలు తమ సొంత ఇళ్లలోకి వెళ్లడానికి కూడా వీలు లేని దయనీయ స్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

కనీస స్పందన లేదు..

ఈ తీవ్రమైన సమస్యపై కరీంనగర్ మున్సిపల్ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా కనీస స్పందన లేకపోవడం దారుణమని బండారి శేఖర్ విమర్శించారు. నిల్వ ఉన్న మురుగు నీటి వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి కాలనీవాసులకు విష జ్వరాలు, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ​ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు కంటితుడుపు చర్యలకు స్వస్తి చెప్పాలని కోరారు. తక్షణమే డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి కొత్తవాడ ప్రజలను ఆరోగ్య ముప్పు నుండి కాపాడాలని డిమాండ్ చేశారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>