నిందితులను కఠినంగా శిక్షించాలి: కరీంనగర్ లో SFI నిరసన!

కలం, ​కరీంనగర్: హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన ఆదివాసీ యువతి వి.కె. శిరీష కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ (Karimnagar) జిల్లా గర్ల్స్ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద SFI ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

​ఈ సందర్భంగా SFI రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంజన, జిల్లా గర్ల్స్ కన్వీనర్ మానస మాట్లాడుతూ.. ఉన్నత చదువు చదువుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు నగరానికి వచ్చిన గిరిజన యువతిపై ఇలాంటి దారుణం జరగడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసులు సమగ్రమైన, పారదర్శకమైన విచారణ జరిపి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.

శిరీష హత్య కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా తక్షణమే విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని,​ ఉద్యోగినికి భద్రత కల్పించడంలో విఫలమైన ఆసుపత్రి యాజమాన్యంపై, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ​బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు SFI ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SFI నాయకులు శృతి, పూజ, రమ్య, శివాని, వసంత, కీర్తన, శ్రీజ, సాత్విక, స్వాతి, తేజస్విని పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>