కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది. చిగురుమామిడి (Chigurumamidi) మండలం సుందరగిరి గ్రామం శివారులో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి సమీపంలోని ఒక వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు నేరుగా బావి కట్టను ఢీకొని ఆగిపోయింది.
బావి కట్ట బలంగా ఉండటంతో బస్సు బావిలో పడిపోకుండా ఆగిపోవడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.

