కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో (Pawan Kalyan Birthday) అపశ్రుతి చోటు చేసుకుంది. అమలాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ కు గురై ఆయన వీరాభిమాని మృతి చెందాడు. మృతుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ప్రేమ్ కుమార్ ఇటీవల సెలవులపై స్వగ్రానికి వచ్చి తన అభిమాన నేత పవన్ కళ్యాణ్ వేడుకల ఏర్పాట్లలో పాల్గొన్నాడు. అమలాపురంలోని ఓ కాలేజీ దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ తీగ తగలడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బీజేపీ నేత యాళ్ల దొరబాబు, జనసేన నాయకులు నల్లా శ్రీధర్, ఏడిద శ్రీను సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువకుడి మృతితో అతని కుటుంబంలో, స్థానికంగా విషాదం నెలకొంది.

