వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, కుటుంబ సభ్యుల నివాళులు.. ప్రత్యేక ప్రార్థనలు

కలం, వెబ్ డెస్క్ : దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్.. ఆయనకు నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. జగన్ తో పాటు ఆయన భార్య వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు, ఆయన అభిమానులు కూడా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

మరోవైపు వైఎస్సాఆర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ వైసీపీ నేతలు , కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మరికాసేపట్లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించే అవకాశం ఉంది. కుటుంబంలో విభేదాలు వచ్చినటప్పటి నుంచి జగన్, షర్మిల వేర్వేరుగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>